నా సైజ్‌ను చూసి ఇష్టపడ్డారా! అంటూ ఫైర్ అయిన ప్రియమణి
Priyamani
ఇప్పటికే తెలుగులో ఓ ఛానల్‌లో వస్తున్న డాన్స్ ప్రోగ్రామ్‌లో జడ్జిగా వున్నారు. ఆమె బాగా సన్నబడ్డారు. చూడ్డానికి ఒకరకమైన పేషెంట్‌లానూ కనిపించారు. ఎన్.టి.ఆర్. నటించిన యమదొంగలో వున్న ఆమె శరీరాకృతికి ఇప్పటికి చాలా తేడా వుంది. ఆమె చర్మరంగు కూడా కాస్త మారింది. ఈ విషయమై నెటిజర్లు ఘాటుగానే కామెంట్ చేశారు. దానికి ఆమె కూడా ఘాటుగానే సమాధానమిచ్చింది. `ఓహ్ మీరు లావుగా వున్నప్పుడు నేను ఇష్టపడ్డాను. ఇప్పుడు మరీ సన్నగా వున్నారు. మీ కలర్ కూడా బాగాలేదు అంటూ కామెంట్ చేశారు.
దాంతో ప్రియమణి ఘాటుగా స్పందిస్తూ, నిజాయితీగా చెప్పాలంటే, నా బరువు 65 కిలోలు. నేను ప్రస్తుతం ఉన్నదానికంటే అందులో పెద్దదిగా కనిపించాను. నేను లావుగా వుంటేనే మీరు ఇష్టపడ్డారా. సన్నగా వుంటే లేదా! ఒకసారి మీ మైండ్‌సెట్ మార్చుకోండి. శరీరాకృతిని చూసి ఇష్టపడతారా! సైజ్‌ను బట్టి అంచనావేస్తారా: అంటూ విరుచుకుపడింది. దాంతో మీరు ఇంతకు ముందుకంటే స్లిమ్‌గానే వున్నారంటూ మరొకరు కూల్ చేశారు.
