అలాంటి సంబంధం వదిలేయండిః పూరీజగన్నాథ్
దర్శకుడు పూరీజగన్నాథ్ సినిమాలోనే కాదు బయట కూడా సూక్తులు చెబుతున్నారు. కరోనా టైంలో ఏకంగా తన పేరుతో మ్యూజింగ్స్ ను సోషల్‌మీడియాలో పెట్టి కొత్తరకం ఫ్యాన్స్‌ను క్రియేట్ చేసుకుంటున్నాడు. మరోవైపు ఈ ఖాళీ సమయంలోనే భార్య భర్తల సంబంధాలపై కూడా ఓ చక్కటి కథను తయారుచేసుకుంటున్నాడట. ఇక భార్య భర్తల సంబంధాలు ఎలా వుండాలో తెలియజేస్తున్నాడు.
ఆడ మగ రిలేషన్స్‌లో గిల్ట్ పీల్ వుండకూడదు. తల్లిదండ్రులతో, స్నేహితులతో ఎలా గిల్ట్ ఫీల్‌కావు. కొన్ని సందర్భాలలో తప్పదు. కానీ భార్యభర్తల మధ్య గిల్ట్ ఫీల్డ్ అవుతున్నారంటే అంత దరిద్రం మరొకటి లేదు. మనం ఎదుటి మనిషిలో గిల్ట్ క్రియేట్ చేస్తే అతను కుంగిపోతాడు. కెరీర్ దెబ్బతింటుంది. ఒకవేళ ఇలాంటి సమస్యలను భార్యభర్తలు ఎదుర్కొంటే ఆ సంబంధాన్ని వదిలేయండి. మొగుడు, పెళ్ళాంని కానీ పెళ్ళాం మొగుడిని కానీ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూడడం దరిద్రం. దాని కోసం ట్రైనింగ్ తీసుకోవడం మూర్ఖత్వమే.
ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఒకరిపై ఒకరు ఆరాతీయడం, ఫోన్ చెక్ చేయడం, పర్సులు చెక్ చేయడం వంటివి చేయకండి. భర్తను మహారాజులా చూసుకుంటే భార్య మహారాణి అవుతుంది. కొంగును ముడివేసుకుని కుక్కలా మార్చుకోవాలంటే నువ్వూ కుక్కవే అవుతావ్.. అంటూ హితబోధ చేస్తున్నాడు.