గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 20 మే 2021 (23:03 IST)

కోవిడ్ 19: చెన్నైలో పరిస్థితి భయంకరంగా వుంది, మా తాత ఐసియులో వున్నారని రవితేజ హీరోయిన్ వెల్లడి

చెన్నైలో ప్రతిరోజూ 6వేలకు పైగా కరోనావైరస్ కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడులో లాక్ డౌన్ విధించినా ఉదయాన సడలించిన సమయంలో జనం రోడ్లపై కిక్కిరిపోతున్నారు. చాలామంది మాస్కులు లేకుండానే వచ్చేస్తున్నారు. దీనితో కరోనా రోజువారి కేసులు తమిళనాడు 30 వేలు దాటి వస్తున్నాయి.
 
ఇదిలావుంటే...  చెన్నైలోనే నివాసం వుండే రవితేజ చిత్రం ఖిలాడి హీరోయిన్ డింపుల్ హయతి కుటుంబంలోని 10 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలిందట. ఈ విషయాన్నే ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. గత వారం రోజుల నుంచి మానసికంగా, భౌతికంగా నరకాన్ని అనుభవిస్తున్నాను. మా తాతయ్య చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసియులో వున్నారు.
 
షూటింగ్ నిమిత్తం నేను హైదరాబాద్ వచ్చాను. కానీ ఇక్కడ లాక్ డౌన్ విధించారు. తమిళనాడులోనూ లాక్ డౌన్ వుంది. దీనితో నేను హైదరాబాదులోనే వుండిపోయాను. నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులతో కలిసిపోయి ఎంజాయ్ చేస్తుండేదాన్ని. మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. ఇంటి నిండా కుటుంబ సభ్యులు వుంటారు. ఐతే ఇప్పుడు వారిలో 10 మందికి కరోనా సోకడంతో మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము అని వెల్లడించింది.