ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 3 జూన్ 2021 (16:49 IST)

మరిదితో భార్య ఏకాంతం, అక్కడే భార్యను నరికి నడిరోడ్డుపై ఈడ్చుకెళ్ళిన భర్త

రాజస్థాన్ లోని రామ్‌పరలో దారుణం జరిగింది. భార్యను చంపి నడివీధిలో ఈడ్చుకెళ్ళాడు భర్త. అలాగే 9 నెలల కొడుకును అతి కిరాతకంగా హత్య చేశాడు. గత కొన్నిరోజులుగా తనకు ఉన్న అనుమానం నిజమని తేలడంతో ఆవేశంతో ఊగిపోయాడు. కళ్ళముందే భార్య తమ్ముడితో ఏకాంతంగా గడపడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. 
 
రాజస్థాన్ లోని రామ్‌పర సమీపంలో ఉన్న బాతాపూర్‌లో కూలి పనిచేసుకున్నాడు సుదీర్ వాల్మీకీ. అతనికి సంవత్సరన్నర క్రితమే వివాహమైంది. భార్య సీమ తొమ్మిది నెలల బిడ్డ అవినాష్ ఉన్నాడు. తన తమ్ముడు దిలీప్ వాల్మీకీ ఇంటిలోనే ఉంటున్నాడు. దిలీప్‌కు ఇంకా వివాహం కాలేదు. 
 
అయితే వివాహమైనప్పుడు బాగానే ఉన్న సుధీర్ సరిగ్గా నెలరోజుల నుంచి భార్యపై అనుమానం పెట్టుకున్నాడు. తన తమ్ముడితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పట్టాడు. దీంతో ఎలాగైనా నిజాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఇంటికి హఠాత్తుగా వెళ్ళగా తమ్ముడు దిలీప్‌తో తన భార్య ఏకాంతంగా ఉండటాన్ని చూశాడు. 
 
దీంతో ఆవేశంతో ఊగిపోతూ గొడ్డలి తీసుకుని గదిలోకి వెళ్ళాడు. అన్నను చూసిన తమ్ముడు అతడిని తోసేసి పారిపోయాడు. దాంతో సుధీర్ తన భార్య సీమతో పాటు కొడుకు అవినాష్‌ను దారుణంగా నరికి నరికి చంపాడు. ఆ తరువాత భార్య మృతదేహాన్ని 80 మీటర్ల వరకు రోడ్డు పైకి లాక్కుని వచ్చాడు. ఒక చేత్తో గొడ్డలి.. మరొక చేత్తో మహిళ మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు.