సంబంధిత వార్తలు
- మరణంలోనూ జంటగా చనిపోయిన ఎస్వీ ప్రసాద్
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాయిగా జీవించాం.. ఈటల రాజేందర్ భార్య
- తప్పు అని తేలితే ముక్కు నేలకు రాస్తారా? ఈటల భార్య జమున ఓపెన్ చాలెంజ్
- నా భర్త కోరిక తీర్చు, నీ అందం తరిగిపోదులే.. కానిస్టేబుల్ భార్య నిర్వాకం
- పుల్వామా దాడిలో భర్త మృతి... లెఫ్టినెంట్‌గా భార్య బాధ్యతలు...
ఆధ్యాత్మిక సూక్తులు: మీ శ్రీమతితో చెప్పకుండా ఆ పని చేయొద్దు
ఆధ్యాత్మికపరంగా పెద్దలు కొన్ని నియమాలను పాటించాలని చెప్పారు. వాటి వెనుక ఎంతో పరమార్థం దాగి వుంటుంది. అలాంటి వాటిలో కొన్నింటిని చూద్దాం. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.
శుభానికి వెళ్తున్నప్పుడు స్రీలు ముందుండాలి. అశుభానికి స్రీలు వెనక వుండాలి. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి. అమంగళాలు కోపంలోను, ఆవేశంలోను ఉచ్చారించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు. పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు.
పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి. కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు. పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్ధపడాలి.
