నిన్న మాజీ సీఎస్ మృతి నేడు... ఆయన భార్య కరోనాతో కన్నుమూత
కరోనా మహమ్మారి కుటుంబాలను కబలించేస్తోంది. రోజుల వ్యవధిలోనే మృత్యు ఘోష సృష్టిస్తోంది. చిన్న, పెద్దా, ధనిక, పేద అనే తేడా లేకుండా ఒక్కసారిగా పంజా విసురుతోంది. దీంతో కరోనా మృతులు పెరుగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ కుటుంబంపై కూడా కరోనా మహమ్మారి విజృంభించింది. ఒక్క రోజు వ్యవధిలో మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్, ఆయన భార్య లక్ష్మీ కన్నుమూశారు. వీరిద్దరికి కరోనా సోకింది.
కొన్ని రోజులుగా సోమాజిగూడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినా సరే వాళ్లను వదిలిపెట్టలేదు. ఎస్వీప్రసాద్ మంగళవారం చనిపోగా.. బుధవారం తెల్లవారుజామున ఆయన భార్య లక్ష్మి కన్నుమూశారు. వీరి కుమారులు కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉంది.
ఇక ఎస్వీప్రసాద్.. 1975 ఐఎస్ బ్యాచ్‌కు చెందిన వారు. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్వీ ప్రసాద్ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత కడప, విశాఖ కలెక్టర్‌గా కూడా ఆయన పని చేశారు. ఏపీ జెన్ కో ఛైర్మన్‌గా, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగానూ విధులు నిర్వహించారు. రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో ఎస్వీ ప్రసాద్ సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించారు. విజిలెన్స్ కమిషనర్‌గా కూడా ఆయన పని చేశారు.