శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 3 జులై 2021 (12:19 IST)

మీ నాన్నను మీరే చూసుకోండి, నేను వెళ్ళిపోతున్నా.. పిల్లలతో తల్లి

ఏ తల్లి అయినా పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించాలి. చెడు మార్గాన వెళుతుంటే వారిని దండించాలి. కానీ ఇక్కడ ఈ తల్లిమాత్రం అందుకు పూర్తి విరుద్ధం. 10 సంవత్సరాల కుమార్తె, 7 సంవత్సరాల కొడుకు ఉంటే కుటుంబాన్ని సాఫీగా నడపాల్సిన ఆమె, ప్రియుడు మోజులో పడి వెళ్ళిపోయింది. కుటుంబం చిన్నాభిన్నమైంది. 
 
పశ్చిమబెంగాల్ లోని దీనజ్ పూర్ జిల్లాలోని కలైబరి గ్రామానికి చెందిన 35 యేళ్ళ వ్యక్తి భార్యతో కలిసి పరీద్ కోట్ లోని మిలిటరీ స్టేషన్లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మిలటరీ సర్వీసు ఇంజనీర్ సర్వీసెస్‌లో ఇద్దరూ పనిచేస్తున్నారు.
 
కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నారు. అక్కడే ఒక వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. సుమారు 8 నెలల నుంచి వీరి బాగోతం నడుస్తోంది. అయితే ఈ విషయాన్ని భర్తకు తెలియకుండా జాగ్రత్త పడింది భార్య. 
 
తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తికి వేరే ప్రాంతానికి బదిలీ అయ్యింది. దీంతో అతను 15 రోజుల క్రితం వెళ్ళిపోయాడు. అది జీర్ణించుకోలేని ఆ వివాహిత తను వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో తన పిల్లలకు విషయం చెప్పింది. మీ నాన్నతో నాకు విసుగొచ్చేసింది. 
 
మీ నాన్నను మీరే చూసుకోండి.. నేను వెళ్ళిపోతున్నానంటూ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన భర్తకు విషయం తెలిసి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.