విద్యార్థికి కామపాఠాలు బోధించి లేపుకెళ్ళిన టీచర్, ఎక్కడ..?

lovers
జె| Last Modified సోమవారం, 14 జూన్ 2021 (20:49 IST)
గురువు అంటే దైవంతో సమానం. మంచి బుద్ధులు నేర్పించి విద్యార్థులను సక్రమ మార్గంలో పెట్టాల్సిన బాధ్యత టీచర్ పై ఉంటుంది. అలాంటిది ఒక టీచర్ ఏకంగా తన వద్ద చదువుకునే విద్యార్థులకే కామపాఠాలు చెప్పింది. ఈ పాఠాల్లో ఒక విద్యార్థి ఇరుక్కున్నాడు. టీచర్ లేనిదే బతుకే లేదనుకున్నాడు. ఆమెతో బాగా కనెక్టయ్యాడు. ఇద్దరూ కలిసి పారిపోయారు.

హర్యానా రాష్ట్రం పానిపట్ పరిసర ప్రాంతంలో నివాసముంటోంది మనీషా. వివాహమై భర్తతో గొడవ కారణంగా పుట్టింటికి వచ్చేసింది. తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో తల్లితోనే ఉంటోంది. కుటుంబ పోషణ కోసం లెక్చరర్‌గా పనిచేస్తోంది. ప్రైవేటు పాఠశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న మనీషాకు పక్కదారి పట్టింది.

అసలే కరోనా కావడంతో పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో మనీషా ఉన్న ఇంటికి దగ్గరలో కొంతమంది విద్యార్థులు ట్యూషన్‌కు వచ్చేవారు. వారిలో ఒకడిని బాగా ప్రేరేపించింది. దీంతో ఆ విద్యార్థి ఆమెకు బాగా దగ్గరయ్యాడు.

ఇంట్లోనే ఆ విద్యార్థితో సరసల్లాపాల్లో మునిగితేలేది టీచర్. అయితే ఈవిషయం కాస్త విద్యార్థి ఇంట్లో తెలిసింది. అతన్ని ట్యూషన్ మాన్పించారు. కానీ మనీషా కోసం ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు విద్యార్థి. మనీషా అతన్ని తీసుకుని ఇంటి నుంచి పారిపోయింది. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరినీ వెతుకుతున్నారుదీనిపై మరింత చదవండి :