1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (15:51 IST)

నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల పర్వం.. మంత్రి ఆళ్ల నాని సీరియస్

నెల్లూరు జీజీహెచ్‌లో ఉన్నతాధికారి లైంగిక వేధింపుల పర్వంపై డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. దీనిపై ఆయన స్పందించారు. ఈ వ్యవహారంపై వాస్తవాలు తెలుసుకునేందుకు సీనియర్ వైద్యులతో త్రిసభ్య కమిటీ వేశారు. నెల్లూరు ACSR మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సాంబశివరావు, ఇద్దరు ప్రొఫెసర్స్‌తో విచారణకు అదేశించారు.
 
సాయంత్రానికి పూర్తి నివేదిక ఇవ్వాలని DME డాక్టర్ రాఘవేంద్ర రావును మంత్రి అదేశించారు. విచారణలో లైంగిక వేధింపులు నిజమే అని తేలితే కఠినంగా చర్యలు ఉంటాయని మంత్రి చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
 
జీజీహెచ్ ఘటనపై రెండు కమిటీలు విచారణ చేపడుతున్నాయని ఇంచార్జి కలెక్టర్ ప్రసాద్ తెలిపారు. 24 గంటల్లో డిస్ట్రిక్ట్ కమిటీ ప్రిలిమనరీ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుందన్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఇంచార్జి కలెక్టర్ ప్రసాద్ తేల్చి చెప్పారు.