వోల్వో బస్సును ఢీకొన్న ట్రక్కు... 18 మంది మత్యువాత
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వోల్వో బస్సును వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన బారాబంకీ పరిధిలోని రామ్‌సనేహీఘాట్ వద్ద చోటుచేసుకుంది.
ప్రమాదానికి గురైన బస్సు హర్యానా రాష్ట్రంలోని పల్వల్ నుంచి బీహార్‍కు కొంతమంది కూలీలను ఎక్కించుకుని వెళుతోంది. వందమంది ప్రయాణికులు ఉన్న ఈ బస్సులో 18 మంది మృతి చెందారు.
బారాబంకీ ఎస్పీ యమునా ప్రసాద్ మాట్లాడుతూ, ఈ బస్సు మరమ్మతుకు గురవడంతో, దానిని రామ్ సనేహీఘాట్ వద్ద నిలిపివుంటారు. ఇంతలో ఒక ట్రక్కు ఈ బస్సును బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించిందని తెలిపారు.