బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జులై 2021 (19:41 IST)

ఒకే ఆఫీసులో భార్య బీడీవో అయితే భర్త స్వీపర్ ... ఎక్కడ?

కొన్ని వార్తలు వినేందుకు విచిత్రంగా ఉంటాయి. అలాంటి వార్తల్లో ఇదొకటి. ఓ కార్యాలయంలో భార్య బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారిగా పనిచేస్తుంటే అదే కార్యాలయంలో ఆమె భర్త స్వీపర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ దృశ్యం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో బ‌లియాఖేరీ బ్లాక్‌లోని 55వ వార్డు నుంచి సోనియా(26) అనే మ‌హిళ బీజేపీ త‌ర‌పున పోటీ చేసింది. ఆ ఎన్నిక‌ల్లో ఆమె గెలిచింది.
 
ఆ త‌ర్వాత బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ చీఫ్ ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. బ‌లియాఖేరి బ్లాక్ ఎస్సీ కేట‌గిరికి కేటాయించారు. సోనియా ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ, విద్యావంతురాలు కూడా. దీంతో ఆ ఎన్నిక‌ల బ‌రిలో ఆమెను బీజేపీ నిల‌బెట్టింది. 
 
ఈ ఎన్నిక‌లో కూడా ఆమె సూనయాసంగా విజ‌యం సాధించింది. బ‌లియాఖేరి బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీసులోనే గ‌త కొంత‌కాలం నుంచి సోనియా భ‌ర్త స్వీప‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. సోనియా బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ చీఫ్‌గా ఎన్నికైన‌ప్ప‌టికీ.. త‌న స్వీప‌ర్ ఉద్యోగాన్ని నిర్వ‌ర్తిస్తాన‌ని ఆమె భ‌ర్త సునీల్ కుమార్ స్ప‌ష్టం చేశారు.
 
దీనిపై ఆమె స్పందిస్తూ, త‌న కుటుంబం, భ‌ర్త మ‌ద్ద‌తు వ‌ల్లే ఈ ఎన్నిక‌ల్లో తాను విజ‌యం సాధించాన‌ని చెప్పారు. ఈ బ్లాక్ అభివృద్ధికి త‌ప్ప‌కుండా కృషి చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ భ‌ర్త ఉద్యోగం చేయ‌డం వ‌ల్లే కుటుంబాన్ని పోషించుకోగ‌లుగుతున్నామ‌ని సోనియా తెలిపారు.