బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 జులై 2021 (23:47 IST)

ఒకే ఆఫీసులో భార్య బ్లాక్ డెవలప్‌మెంట్ చీఫ్.. భర్త స్వీపర్.. ఎక్కడంటే?

Sonia
ఒకే ఆఫీసులో భార్య చీఫ్ హోదాలో ఉంటే అదే ఆఫీసులో ఆమె భర్త స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. బహుశా ఇటువంటిది జరుగుతుందని బహుశా ఆ భర్త కలలో కూడా అనుకుని ఉండడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల బ్లాక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. 
 
ఈ ఎన్నికల్లో బలియాఖేరీ బ్లాక్‌లోని నివసించే సోనియా అనే 26 ఏళ్ల మహిళ 55వ వార్డు నుంచి బీజేపీ తరపున పోటీ చేసింది. ఎన్నికల్లో విజయం సాధించింది. దీంతో ఆమె బ్లాక్ డెవలప్‌మెంట్ చీఫ్ అయ్యింది. అదే ఆఫీసులో అప్పటికే సోనియా భర్త సునీల్ కుమార్ స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో భార్య బ్లాక్ డెవలప్‌మెంట్ చీఫ్ అయితే భర్త అదే ఆఫీసులో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు.
 
ఈ నేపథ్యంలో సోనియా బ్లాక్ డెవలప్‌మెంట్ చీఫ్‌గా ఎన్నికైనా.. తను స్వీపర్ ఉద్యోగాన్ని కొనసాగిస్తానని నాకు నామోషీ ఏమీ లేదని నా భార్యకు అంత ఉన్నతస్థాయికి చేరినందుకు ఆనందంగా ఉందని సునీల్ కుమార్ స్పష్టం చేశాడు. భర్త అలా అంటే సోనియా కూడా తన భర్త గురించి గొప్పగా చెప్పింది. "నా భర్త..నా కుటుంబం నన్ను ఎంతగా ప్రోత్సహించారని అందుకే ఈ ఎన్నికల్లో విజయం సాధించాను" అని తెలిపింది.