సంబంధిత వార్తలు
- వర్మ ''జీఎస్టీ'' కలెక్షన్లను కుమ్మేస్తోందట.. ఇప్పటికే రూ.11కోట్లు?
- 'జి.ఎస్.టి'కి ప్రేక్షకుల ఫుల్‌సపోర్ట్... ఇక జీఎస్టీ-2 : రాంగోపాల్ వర్మ
- 'నాకంటే పిచ్చోడివి కాబట్టే నిన్ను నమ్మాను' : కీరవాణికి వర్మ రీ ట్వీట్
- దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఓ హోమోసెక్సువల్!?
- జై కుమారే అసలు దొంగన్న వర్మ- ట్రాఫిక్ వల్లే జీఎస్టీ లింకు ఓపెన్ కాలేదు
జీఎస్టీ మూవీ నిర్మాణ ఖర్చు రూ.70 లక్షలు.. లాభం రూ.11 కోట్లు.. ఎలా?
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం గాడ్, సెక్స్ అండ్ ట్రూత్. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంగ్లీష్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించింది.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం గాడ్, సెక్స్ అండ్ ట్రూత్. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంగ్లీష్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించింది.
మొత్తం 19 నిమిషాల నిడివి గల ఈ చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. దీంతో, నెట్లో ఇది విడుదల కాగానే, చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. లక్షల మంది ఒక్కసారిగా సైట్లోకి ఎంటర్ కావడంతో అది క్రాష్ అయింది కూడా.
ఈ చిత్ర నిర్మాణానికి దాదాపు రూ.70 లక్షలు ఖర్చు చేశారు. ఈ మొత్తంలో కూడా ఎక్కువ డబ్బులను మియాకే ఇచ్చారట. మరికొంత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి ఇవ్వగా, ఈ చిత్రం ఇప్పటివరకు ఏకంగా 11 కోట్ల రూపాయలను వసూలు చేసిందట.
ఈ చిత్రం ఎన్నో వివాదాలు చుట్టిముట్టినప్పటికీ.. కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లు సాధించడం గమనార్హం. ఈ ఖుషీతోనే రాంగోపాల్ వర్మ గాడ్, సెక్స్ అంట్ ట్రూత్ రెండో భాగాన్ని తీయనున్నట్టు ఆర్జీవీ ప్రకటించారు.
