సంబంధిత వార్తలు
- మయన్మార్‌లో తిరుగుబాటు.. 38మంది మృతి.. రోడ్డుపైనే మృతదేహాలు..
- బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సినీ నటి ఖుష్బూ సుందర్
- కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్.. డబ్బుల్లేక ఇబ్బందుల్లో నటుడు పొన్నంబళం
- వారంతా ఒక్కటే.. ఏ ఒక్కరినీ నమ్మొద్దు : హీరో శివాజీ
- శర్వానంద్ పుట్టిన రోజు.. గమ్యంతో మొదలెట్టి శ్రీకారం చుట్టాడు.. (video)
జబర్దస్త్ షో నటుడు శాంతి స్వరూప్ ఇలా అనేశాడే.. నిజమేనా?
Shanthi Swaroop
అప్పటి వరకు ఎన్ని షోలు వచ్చినా కూడా దీని స్థాయిలో మాత్రం రేటింగ్ తీసుకురాలేదు. ఏడేళ్లుగా నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఇండస్ట్రీకి ఎంతోమంది కమెడియన్స్‌ను కూడా అందించింది జబర్దస్త్. అక్కడ్నుంచి వచ్చిన వాళ్లే ఇప్పుడు సినిమాలు కూడా చేసుకుంటున్నారు.
జబర్దస్త్ క్రేజ్‌తోనే వాళ్లకు బాగా డబ్బులు వస్తున్నాయి కూడా. ఈ షోతో వచ్చిన ఇమేజ్ కారణంగా బయట ఈవెంట్స్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఫారెన్ వెళ్లి అక్కడ కూడా స్టేజ్ పర్ఫార్మెన్సులు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ షోలో వాళ్లకు అందుతున్న రెమ్యునరేషన్స్‌పై మాత్రం ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్లకు ఎపిసోడ్‌కు 4 లక్షల వరకు వస్తుందని చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. మిగిలిన వాళ్లకు కూడా కనీసం లక్షన్నర నుంచి 2 లక్షలకు తక్కువ కాకుండా వస్తుందని ప్రచారం ఉంది.
ఇవన్నీ నిజమేనేమో.. ఒక్కో ఎపిసోడ్‌కు అంత ఇస్తున్నారేమో అనే అనుమానాలు కూడా అందర్లోనూ ఉన్నాయి. అయితే కొందరు జబర్దస్త్ కమెడియన్స్ చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తుంటే మాత్రం అంత ఉండదని తేలిపోయింది.
ఇవన్నీ బయటికి చెప్పుకునే దొంగ లెక్కలు.. ఇచ్చుకునే బిల్డప్పులే కానీ అన్నేసి లక్షలు ఇచ్చేంత సీన్ అక్కడ లేదని మరో కమెడియన్ శాంతి స్వరూప్ చెప్తున్నాడు. వీళ్లకు అన్నేసి లక్షలు ఇస్తున్నారని అనవసరంగా బయట చెప్తారు కానీ తమకు వచ్చేది మాత్రం అంత ఉండదని చెప్పుకొచ్చాడు శాంతి.
నిజానికి తమకు జబర్దస్త్ కంటే కూడా బయట చేసే ఈవెంట్స్ నుంచి ఎక్కువ సంపాదించుకుంటామని చెప్తున్నాడు శాంతి స్వరూప్. అంతేకాదు అక్కడ రెగ్యులర్‌గా పేమెంట్ ఇచ్చేవాళ్లు కూడా తక్కువే ఉన్నారని సంచలన విషయాలు చెప్పాడు శాంతి. ఏదేమైనా కూడా మల్లెమాల ఇచ్చేదాని కంటే కూడా బయట చెప్పుకునేది మాత్రం రెండింతలు ఉందనేది శాంతి స్వరూప్ చెప్తున్న మాట.
