1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Kannada actor Suraj Kumar loses leg in accident

కన్నడ నటుడు సూరజ్‌కు కాలు తీసేశారా?

suraj kumar
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కన్నడ నటుడు సూరజ్ కుమార్‌కు కాలు తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి. శనివారం మైసూర్ - గుడ్లుపేట్ జాతీయ రహదారిపై బైకుపై వెళుతుంగా బెగూర్ వద్ద వేగంగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సూరజ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆయన కుడికాలు నుజ్జు నుజ్జు కావడంతో ఆయన కాలు తీసేసినట్టు సమాచారం. 
 
ఈ ప్రమాదంపై పోలీసులు స్పందిస్తూ, సూరజ్ మైసూర్ నుంచి ఊటికి బైకుపై బయలుదేరాడు. రోడ్డుపై ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేయబోయిన సమయంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సూరజ్ కుమార్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో కాలును తీసేసినట్టు సమాచారం. అయితే, దీనిపై వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సివుంది. కాగా, దివంగత నిర్మాత, పార్వతమ్మ రాజ్‌కుమార్ సోదరుడు సినీ నిర్మాత ఎన్ఏ శ్రీనివాస్ కుమారుడే సూరజ్ కుమార్. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత సూరజ్ తన పేరును ధృవన్‌గా మార్చుకున్నారు. 
తర్వాతి కథనం
అభినవ్ సర్దార్ మిస్టేక్ రాబోతుంది