1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్

గర్భంతో ఉన్న తల్లిని తుపాకీతో కాల్చి చంపిన రెండేళ్ల కుమారుడు

gunshot
అమెరికాలో దారుణం జరిగింది. నిండు గర్భంతో ఉన్న తల్లిని రెండేళ్ళ కుమారుడు కాల్చి చంపేశాడు. బొమ్మ తుపాకీగా భావించి నిజం తుపాకీతో కాల్చడంతో ఈ విషాదం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అమెరికాలో ఒహియో లారా అనే 32 యేళ్ల మహిళ తన భర్తతో కలిసి ఉంటుంది. ఆమె ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. వీరికి రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. భర్త ఉద్యోగానికి వెళ్లిన సమయంలో తన కొడుకుతో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉండేది. పిల్లోడు ఇంట్లో ఆడుకుంటుండగా ఓ తుపాకీ కనిపించింది. అది బొమ్మ తుపాకీ అని భావించిన పిల్లోడు... ఇంటి పనుల్లో నిమగ్నమైవున్న తల్లిని వెనుక వైపు నుంచి కాల్చాడు. దీంతో ఆమె వెన్ను భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో కిందపడిపోయింది. 
 
అప్పటికీ తన భర్తతో పాటు ఎమర్జెన్సీ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం చేరవేసింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రెండేళ్ళ బాలుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నాడు. బాధితురాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.