1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 15 జూన్ 2023 (12:16 IST)

లారీ ఢీకొట్టిన కారు... ఆరుగురు దుర్మరణం

road accident
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా విజయవాడ వైపు నుంచి రాజమండ్రికి వస్తుండగా, ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలతో పాటు రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. 
 
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానికులు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మృతుల స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వలిచేరు కాగా, రాజమండ్రిలోని ప్రకాష్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ వివాహానికి హాజరై తిరిగి రాజమండ్రి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.