సంబంధిత వార్తలు
- చిక్కుల్లో పవన్ "అజ్ఞాతవాసి".. కాపీ కొట్టారంటూ ఫ్రెంచ్ దర్శకుడు ట్వీట్
- పెళ్లాన్ని కాపాడుకోలేని పవన్ రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు: కత్తి మహేష్
- ప్లీజ్ పవన్.. తెలంగాణ నుంచి పోటీ చేయొద్దు.. ఎవరు?
- చిరంజీవితో అలా తప్ప ఇంకెలాగైనా నటిస్తానంటున్న కీర్తి సురేష్
- 'జోకర్' పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తానంటున్న 'కత్తి'
త్రివిక్రమ్‌కు కాపీ చేయడం తప్ప ఇంకేమీ తెలియదు: కత్తి మహేష్ (Video)
సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ పబ్లిసిటీ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై పడ్డాడని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. అన్నీ అంశాలపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నాంటూ చెప్పుకొచ్చే కత్తి మహేష్.. ఎక్కువ పవన్ కల్యాణ్
సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ పబ్లిసిటీ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై పడ్డాడని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. అన్నీ అంశాలపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నాంటూ చెప్పుకొచ్చే కత్తి మహేష్.. ఎక్కువ పవన్ కల్యాణ్‍ను టార్గెట్ చేసుకుని కామెంట్స్ చేస్తున్నాడనేది పవర్ స్టార్ ఫ్యాన్స్ వాదన.
అయితే తాజాగా కత్తి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌పై కూడా విమర్శలు గుప్పించాడు. అజ్ఞాతవాసి సినిమా కాపీ అంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు సినిమాలకు కాపీ చేయడం తప్ప మరేమీ తెలియదన్నాడు.
త్రివిక్రమ్ అనే దర్శకుడు కాపీ చెయ్యకుండా రాసిన, తీసిన సినిమా ఒక్కటి కూడా లేదంటూ కత్తి ఏకిపారేశాడు. కొన్ని సీన్లలో, సీక్వెన్సో, ఏకంగా కథనో కాపీ చేస్తూ వుంటాడని ఎద్దేవా చేశాడు.
ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ రచనలలో నుంచీ కొన్ని వాక్యాల్ని, ఆలోచనల్ని అరువు తెచ్చుకుని తనదైన కొన్ని పదాలను అక్కడక్కడా కూర్చి, మాయ చేసి త్రివిక్రమ్ మెప్పిస్తుంటాడని విమర్శించాడు. అంతటితో ఆగకుండా మన కర్మకొద్దీ ఆ మాత్రం రచయితలు ఎవ్వరూ లేక అగ్రదర్శకుడిగా త్రివిక్రమ్ చలామణి అయిపోతున్నాడని.. కత్తి మహేష్ సెటైర్లు వేశాడు.
