శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 జనవరి 2018 (09:54 IST)

చిక్కుల్లో పవన్ "అజ్ఞాతవాసి".. కాపీ కొట్టారంటూ ఫ్రెంచ్ ద‌ర్శ‌కుడు ట్వీట్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కి, ఈనెల 10వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ఇపుడు కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. 'అజ్ఞాత‌వాసి' చిత

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కి, ఈనెల 10వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ఇపుడు కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. 'అజ్ఞాత‌వాసి' చిత్రం తన చిత్రానికి కాపీ అంటూ ఫ్రెంచ్ ద‌ర్శ‌కుడు తాజాగా ఓ ట్వీట్ చేశారు. 
 
నిజానికి 'అజ్ఞాతవాసి' చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. కేవ‌లం తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు విదేశాల‌లోనూ ఈ మూవీపై చాలా ఆస‌క్తి నెల‌కొంది. రీసెంట్‌గా విడుద‌లైన "కొడ‌కా కోటేశ్వరరావు" సాంగ్ రికార్డులు చెరిపేస్తుంది. ఇలాంటి స‌మ‌యంలో 'అజ్ఞాత‌వాసి' చిత్రం ఫ్రెంచి సినిమా "లార్గోవించ్‌"కి కాపీ అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ వార్త ఫ్రెంచి డైరెక్ట‌ర్‌కి కూడా చేరింది. 
 
వెంటనే త‌న ట్విట్ట‌ర్ ద్వారా 'లార్గోవించ్' చిత్ర‌ దర్శకుడు జెరొమ్ సల్లే త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. ఓ తెలుగు సినిమా త‌న మూవీని కాపీ చేయ‌డంపై కాస్త ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూనే త‌న ఒపీనియ‌న్ ఆయన వెల్లడించారు. 'అజ్ఞాత‌వాసి' టికెట్ కొనాలని అనుకుంటున్నాను.. చాలా క్యూరియస్‌గా ఉన్నాను' అని ట్వీట్ చేశాడు. లార్గోవించ్ సినిమా రీమేక్ రైట్స్‌ను టీ-సీరిస్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ పరిస్థితుల్లో 'అజ్ఞాత‌వాసి' చిత్రం నిజంగానే ఫ్రెంచి సినిమాకి కాపీ అయితే కాస్త ర‌చ్చ త‌ప్ప‌దేమో.