1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Kiran Abbavaram and Devika Bhat, immersed in real-life love

Devika Bhat: రియాలిటీ ప్రేమలో మునిగిపోయిన కిరణ్ అబ్బవరం, దేవికా భట్

Kiran Abbavaram, Devika Bhat
Kiran Abbavaram, Devika Bhat
హీరో కిరణ్ అబ్బవరం  'క', 'కె-రాంప్' చిత్రాల విజయాల తర్వాత ఆయన తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకం రియాలిటీ' తో అలరించనున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు కూడా కిరణ్ అబ్బవరం స్వయంగా చేపట్టడంతో పాటు హీరోగా నటిస్తున్నారు. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తుండగా, సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన  టైటిల్‌ గ్లింప్స్  కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
 
 
తాజాగా ఈ సినిమాలో  హీరోయిన్ నటిస్తున్న దేవికా భట్‌ను ‘ఆలోచన’ గా పరిచయం చేస్తూ మేకర్స్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో దేవికా భట్  అందంగా, సహజమైన చిరునవ్వుతో ఆకట్టుకుంటున్నారు. హీరోతో ఆమె పంచుకుంటున్న ఆత్మీయమైన క్షణాలు, ఇద్దరి మధ్య కనిపిస్తున్న అనుబంధం పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  
 
ఈ చిత్రానికి  భీమ్స్ సిసిరోలియో సంగీతం  అందిస్తున్నారు. విశ్వాస్ డేనియల్ డీవోపీ, సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, సంతోష్ నాయుడు ఎడిటర్‌గా, రాజేష్ కామర్సు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
 
'రియాలిటీ' క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
 
తారాగణం: కిరణ్ అబ్బవరం, దేవికా భట్, శరత్ కుమార్, సాయి కుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Jabardasth Emmanuel: నందినీ రెడ్డి ఆవిష్కరించిన డెస్టినీ ఫస్ట్ లుక్