ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 8 జులై 2021 (17:55 IST)

`కిరాత‌క` బాగా న‌చ్చిన క‌థః పాయ‌ల్‌

Adi Sai kumar, Payal Rajput
ఆది సాయికుమార్, పాయ‌ల్ రాజ్ పూత్ హీరో హీరోయిన్లుగా ఎం.వీర‌భ‌ద్రమ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం `కిరాత‌క‌`. విజ‌న్ సినిమాస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన `కిరాత‌క` టైటిల్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ రోజు `కిరాతక` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌కి ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌స్తోంది. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగస్ట్ 13నుండి ప్రారంభంకానుంది.
 
ఈ సంద‌ర్భంగా పాయ‌ల్ రాజ్‌పూత్ మాట్లాడుతూ, నేను ఇప్ప‌టివ‌ర‌కు చాలా క‌థ‌లు విన్నాను..కాని ఈ థ్రిల్ల‌ర్ క‌థ‌ నాకు బాగా న‌చ్చింది.పెర్‌ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్‌. అలాగే ఆదితో ఫ‌స్ట్ టైమ్ న‌టిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్‌కి, నిర్మాత నాగం తిరుపతిరెడ్డికి స్పెష‌ల్ థ్యాంక్స్ అన్నారు.
 
నిర్మాత డా. నాగం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ,  ఆది, ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్‌గారి హిట్ కాంబినేష‌న్ లో ఒక ప‌ర్‌ఫెక్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. వీర‌భ‌ద్ర‌మ్ గారు చెప్పిన క‌థ బాగా న‌చ్చి పాయిల్ రాజ్‌పూత్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. త‌ప్ప‌కుండా క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్ సక్సెస్ సాధిస్తాం అనే న‌మ్మ‌కం ఉంది. త్వ‌ర‌లో గ్రాండ్ ఓపెనింగ్ జ‌రిపి ఆగ‌స్ట్ 13నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తాం``అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు ఎం.వీర‌భ‌ద్ర‌మ్ మాట్లాడుతూ, ప్ర‌స్తుతం ఆర్టిస్టుల ఎంపిక జ‌రుగుతోంది. ఈ చిత్రంలో పూర్ణ ఒక ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే  దాస‌రి అరుణ్ కుమార్, దేవ్‌గిల్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఆది ఇంత వ‌ర‌కూ చూడ‌ని ఒక స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. `కిరాత‌క` క‌థ న‌చ్చి సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ సినిమాలో న‌టించ‌డానికి  పాయ‌ల్ రాజ్‌పూత్ ఒప్పుకుంది. ఆమె క్యారెక్ట‌ర్ కూడా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంది. భారీ బ‌డ్జెట్‌తో విజన్ సినిమాస్ బ్యాన‌ర్‌లో నాగం తిరుప‌తి రెడ్డిగారు అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు`` అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌: రామ్‌రెడ్డి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: తిర్మల్ రెడ్డి యాళ్ల.