శుక్రవారం, 12 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 జూన్ 2021 (11:31 IST)

అవన్నీ నిరాధారమైన వార్తలు ... వివాదాల్లోకి లాగొద్దు : ఆర్ఎక్స్ బ్యూటీ

తన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆర్ఎక్స్ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. తెలుగు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొడం లేదని స్పష్టం చేసింది. ఈ వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేసింది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'నేను బిగ్‌బాస్‌ 5వ సీజన్‌లో భాగం కావడం లేదు. ఈ వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. అనవసరమైన పుకార్లను సృష్టించి నన్ను వివాదాల్లోకి లాగొద్దు' అంటూ పాయల్‌రాజ్‌పుత్‌ ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేసింది.
 
తెలుగు ‘బిగ్‌బాస్‌-5’ సీజన్‌ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం కంటెస్టెంట్స్‌ ఎంపికకు కసరత్తును ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ తారల పేర్లు తెరపైకొస్తున్నాయి. గత బిగ్‌బాస్‌ సీజన్‌లో పాయల్‌రాజ్‌పుత్‌ ఓ ప్రత్యేక గీతంలో అలరించిన విషయం తెలిసిందే. 
 
దాంతో ఆమె తాజా సీజన్‌లో పాల్గొనబోతున్నదని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. వీటన్నింటికి తన ట్వీట్‌ ద్వారా సమాధానమిచ్చింది. తెలుగులో ‘ఆర్‌.ఎక్స్‌.100’ చిత్రం ద్వారా అరంగేట్రం చేసిన ఈ సుందరి తొలి సినిమాతోనే యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత సీత, వెంకీమామ, డిస్కోరాజా వంటి సినిమాల్లో సత్తా చాటింది.