మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (21:33 IST)

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేష్ ఫ్యామిలీ ఫోటో

Mahesh babu
టాలీవుడ్‌లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన సమయాన్ని కచ్చితంగా ఇస్తాడు సూపర్ స్టార్. సమయం దొరికితే ఓకే.. దొరకకపోతే కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని మరీ కచ్చితంగా హాలిడే ట్రిప్ కు వెళుతుంటాడు. మహేష్ కుటుంబానికి అంత ప్రాధాన్యత ఇస్తాడు. 
 
తాజాగా సోషల్ మీడియాలో ప్రస్తుతం మహేష్ బాబు పాత ఫ్యామిలీ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. అందులో తన ఇద్దరు పిల్లలను ఎత్తుకొని ఉన్నాడు సూపర్ స్టార్. ఇదిగో మా ఫ్యామిలీ మ్యాన్ అంటూ మహేష్ బాబు అభిమానులు ఈ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు.
 
కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్. పరశురాం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీకి కమిట్ మెంట్ ఇచ్చాడు. ఏదేమైనా అటు సినిమాలు ఇటు ఫ్యామిలీ రెండింటినీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయడంలో మహేష్ ఆరితేరిపోయాడు.