మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (18:53 IST)

చైనా: అలసిపోయిన గజరాజులు.. గాఢనిద్ర ఫోటోలు వైరల్

Elephant
చైనాలో జరిగిన ఓ దృశ్యం ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. చైనాలో తిరగాడిన గజరాజులు బాగా అలసిపోయి ఆదమరచి గాఢనిద్రలో వున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు ట్రెండింగ్‌లో నిలిచాయి. 
 
జూన్ మూడో తేదీ నైరుతి చైనాలోని, యునాన్ ప్రావిన్స్‌లోకి దాదాపు 15 ఏనుగులు గుంపుగా .. జనవాసాల్లోకి వచ్చాయి. ఈ ఏనుగుల గుంపు ఆహారం కోసం జనవాసాల్లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ఇలా ఆహారం కోసం 500 కిలోమీటర్లు నడక సాగించాయి. అయితే ప్రజలకు ఈ ఏనుగులు ఎలాంటి ఆటంకాలు కలిగించలేదు. 
 
వీటిని చూసిన అధికారులు అడవుల్లోకి ఏనుగులను తరలించే పనిలో పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. చైనా ప్రభుత్వ ఛానెల్‌లో ఏనుగుల గుంపును అడవికి పంపే దృశ్యాలను లైవ్‌గా ప్రసారం చేసింది.
Elephant
 
అడవిలోకి వెళ్లే క్రమంలో 15 ఏనుగులు.. అలసిపోయి.. గాఢంగా నిద్రపోయాయి. ఆ గుంపులో పెద్ద ఏనుగులు నిద్రిస్తుంటే ఓ గున్న ఏనుగు ఆడుకుంటున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.