శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి

హంసా నందినికి ఏమైంది..? సోషల్ మీడియాలో కనిపించలేదే..!

ఈ మధ్య హంసా నందిని స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తున్న విషయం తెలిసిందే. అంతేగాకుండా.. సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉండే అందాల కథానాయిక హంసా నందిని కొద్ది రోజులుగా యాక్టివ్‌గా ఉండడం లేదు. 
 
దీనిపై వందలాదిగా ట్విట్టర్ ఇన్ స్టా ఫాలోవర్స్ ఇదే విషయాన్ని ప్రశ్నించారట. అయితే తాను తన కుటుంబం 25 రోజుల పాటు కోవిడ్ చికిత్స కోసం ఆస్పత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చిందని ఎట్టకేలకు కోలుకున్నామని హంసానందిని తెలిపారు.
 
కుర్రాళ్లు క్షమించండి. నేను ఏప్రిల్ 9న కరోనా బారిన పడ్డాను. దాదాపు 30 రోజులు కరోనాతో బాధపడ్డాను. కరోనా అని తెలిసిన వెంటనే నేను నా ఫ్యామిలీ ఆసుపత్రిలో చేరాము. నా ఇన్ బాక్స్ అంతా మీ మెసేజ్‌లతో నిండి ఉంది. నేను ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను. 
 
ఆసుపత్రిలో చేరిన 25 రోజుల తరువాత నా కుటుంబం తిరిగి ఇంటికి వచ్చి కోలుకుంటోందని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇంట్లోనే ఉండి మీ ప్రియమైన వారిని బాగా చూసుకోండి..!! అంటూ హంసా నందిని పేర్కొంది.