ఒక గ్రామంలో 45మందికి కరోనా.. ఆ శుభకార్యం కొంపముంచింది
తెలంగాణలో కోవిడ్ తగ్గుముఖం పడుతోంది. అంతేగాకుండా లాక్డౌన్‌ను ఎత్తివేసే అవకాసం కూడా వుంది. కానీ మధ్యాహ్నం వరకు సడలింపులు ఉండటంతో సడలింపులు ఉన్న సమయంలోనే శుభకార్యాలు నిర్వహిస్తున్నారు. శుభకార్యాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరవుతుంటారు. ఇలాంటి శుభకార్యాల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోంది.
తాజాగా, నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం కంఠం గ్రామంలో జరిగిన ఓ శుభకార్యం కొంపముంచింది. ఈ శుభకార్యం జరిగిన తరువాత గ్రామంలో గత వారం రోజుల వ్వవధిలో 45 మందికి కరోనా సోకింది.
ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర నుంచి ఈ శుభకార్యానికి హాజరైన వారి నుంచే కరోనా వ్యాప్తి చెందినట్లు అనుమానిస్తున్నారు. గ్రామంలో కేసులు పెరుగుతుండటంతో కంఠం గ్రామంలో అధికారులు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.