శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 జూన్ 2021 (13:50 IST)

తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత.. నైట్ కర్ఫ్యూ అమలుకు అవకాశం?

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్ మరోసారి పొడిగించవద్దని కేసీఆర్ సర్కారు భావిస్తోంది. పగటి పూట పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేసి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేసే అవకాశముందని తెలుస్తోంది. 
 
రాష్ట్ర కేబినెట్ సమావేశం, జూన్ 8వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో వైద్యం, కరోనా పరిస్థితులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్, రాష్ట్ర ఆర్థికపరిస్థితి అంశాలపై చర్చించనున్నారు.
 
లాక్‌డౌన్ ఎత్తివేసిన అనంతరం పలు వ్యాపారాలతో పాటు మెట్రో రైళ్లకు, ఆర్టీసీ బస్సులకు సాయంత్రం 7 వరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు కొనసాగుతున్నాయి. ఈ నెల 9తో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ముగియనుంది.