గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (13:16 IST)

OnePlus Nord CE: జూన్ 11న ప్రీ ఆర్డర్ చేసే వారికి రూ. 2,699 విలువ చేసే గిఫ్ట్

OnePlus Nord CE
మార్కెట్లోకి వన్ ప్లస్ మరో ఫోన్‌ను మార్కెట్లొకి లాంచ్ చేయనుంది. వన్ ప్లస్ Nord CE 5Gను జూన్ 10న లాంచ్ చేస్తోంది. OnePlus Nord CE 5G లాంచ్ కోసం ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంచాలని ప్రయత్నింస్తుంది. ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేకతలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది. ఇప్పటికే రెండు ఫీచర్లను ఇప్పటికే రివీల్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్న 4 మిస్టరీయస్ ఫీచర్లను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది.
 
ఇక మిగిలిన రెండు మిస్టీరియస్ ఫీచర్లను జూన్ 4 మరియు జూన్ 8 న రివీల్ చేస్తున్నట్లు డేట్స్ ప్రకటించింది. అలాగే, OnePlus Nord CE 5G స్మార్ట్ ఫోన్ ను జూన్ 11న ప్రీ ఆర్డర్ చేసే వారికి రూ. 2,699ల విలువ గల గిఫ్ట్స్‌ని కూడా ఇవ్వనున్నట్లు అఫర్ చేస్తోంది. వన్ ప్లస్ అదే రోజు ఒక కొత్త స్మార్ట్ టీవీ ని కూడా విడుదల చేయబోతోంది.
 
ఇండియాలో ఇప్పటికే OnePlus Nord ని మంచి ఫీచర్లతో తక్కువ ధరలో అందించిన వన్ ప్లస్, ఈ కొత్త OnePlus Nord CE 5G స్మార్ట్ ఫోన్ ను ఎటువంటి ఫీచర్లతో తీసుకువస్తుందో చూడాలి. రివీల్ చేసిన వివరాల ప్రకారం, ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ చాలా సన్నని డిజైన్‌తో ఉన్నట్లు చెబుతోంది.
 
డిస్ల్పే చూస్తే.. 6.43-inch
ముందు కెమెరా 16 ఎంపీ
వెనకవైపు కెమెరా 64 ఎంపీ,
ప్రోసెస్సేర్ Qualcomm Snapdragon 750G,
Android 11
ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.