ఆది సాయికుమార్ హీరోగా నూతన చిత్రం
వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తూ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఆది సాయికుమార్ హీరోగా నాటకం చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం అవుతుంది. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్4గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ విజన్ సినిమాస్ పతాకంపై ఆది సాయికుమార్ హీరోగా సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ చెప్పిన కథ నచ్చింది. ఆది సాయికుమార్‌ను మరో కొత్త డైమన్షన్‌లో ప్రెజంట్ చేసే చిత్రమిది. అలాగే హీరో సునీల్ మా చిత్రంలో ఓ కీ రోల్‌లో కనిపించబోతున్నారు. అదేంటనేది సినిమా చూడాల్సిందే. పాత్రకున్న ప్రాధాన్యతను బట్టి.సునీల్‌గారైతే బావుంటుందని ఆయన్ని కలిసి అడగ్గానే ఆయన నటించడానికి ఒప్పుకున్నందుకు ఆయనకు స్పెషల్ థాంక్స్. ఈ చిత్రాన్ని మా బ్యానర్‌పై ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నాం. ఎన్నో చిత్రాలకు సక్సెస్‌ఫుల్ మ్యూజిక్‌ను అందించిన సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి మణికాంత్ ఎడిటర్. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోయే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను వివరాలను తెలియజేస్తాం అన్నారు.