1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Mahesh Babu MIND BLOCK Song record

MIND BLOCK పాట రికార్డ్.. 100+ మిలియన్ వ్యూస్ (వీడియో)

Mahesh Babu
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌‌గా నిలిచింది. మహేష్ బాబు మొదటిసారి ఆర్మీ లుక్‌లో కనిపించాడు. 
 
ఇక సినిమాకి ముందు దేవీ శ్రీ అందించిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాలోని మైండ్ బ్లాంక్ వీడియో సాంగ్ యూట్యూబ్‍‌లో ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌ను రాబట్టింది.

ఈ పాటలో మహేష్ బాబు రష్మికల డాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మహేష్ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించిన ఈ మూవీ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రష్మిక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ సంయుక్తంగా నిర్మించారు.
 
తర్వాతి కథనం
జీ5 ఓటీటీ నెక్స్ట్ తెలుగు ఒరిజినల్ ప్రొడ్యూస్ చేస్తున్న సుష్మితా కొణిదెల, విష్ణు ప్రసాద్