శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Modified: శుక్రవారం, 3 జులై 2020 (20:30 IST)

సరోజ్ ఖాన్ మరణ వార్త నన్ను కలచివేసింది: మహేష్ బాబు

బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకున్నది. లెజండరీ బాలీవుడ్ కొరియోగ్రాపర్ సరోజ్ ఖాన్(71) ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. శ్వాసకోస వ్యాధితో బాధ పడుతున్న ఆమె ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కూతురు నిర్థారించారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సంతాపం తెలిపింది.
 
నిమ్రత్ కౌర్, కునాల్ కోహ్లీ, రితేష్ దేశ్ ముఖ్, మనోజ్ బాజ్పాయ్, సునీల్ గ్రోవర్, అక్షయ్ కుమార్ తదితరులు సరోజ్ ఖాన్‌తో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సరోజ్ ఖాన్ మరణవార్తతో నా గుండె పగిలింది. రాబోయే తరాలకి ఆమె స్పూర్తిదాయకం. సరోజ్ ఖాన్ మృతికి నా సంతాపం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని తెలియజేసారు.
 
ఇక సరోజ్ ఖాన్ టాలీవుడ్లో బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ వంటి టాప్ హీరోలతో కలిసి పనిచేశారు. డోలా రే డోలా, ఏక్ దో తీన్, థక్ థక్ ఇలా ఏన్నో సూపర్ హిట్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేసారు. సరోజ్ ఖాన్‌కు భర్త సోహన్ లాల్, కొడుకు హమీద్ ఖాన్, కూతురు హీనా ఖాన్, సుఖైన ఖాన్ ఉన్నారు.