శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 1 జులై 2020 (19:59 IST)

గ్యాస్ లీకేజీ సంఘటన పట్ల గవర్నర్ విచారం

విశాఖ గ్యాస్ లీకేజ్ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. మంగళవారం తెల్లవారుజామున విశాఖపట్నం పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీ కర్మాగారంలో బెంజిమిడాజోల్ గ్యాస్ లీకేజీ జరిగిన సంఘటనపై గవర్నర్ విచారం వెలిబుచ్చారు.
 
సంఘటనలో సంస్ధకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు ఆసుపత్రి పాలయ్యారు. గ్యాస్ లీకేజీని ప్రభుత్వ యంత్రాంగం అదుపులోకి తీసుకు రాగా, బాధిత వ్యక్తులు పూర్తిగా కోలుకునే వరకు పూర్తి స్థాయి వైద్య సంరక్షణ, చికిత్స అందించాలని గవర్నర్ శ్రీ హరిచందన్ ప్రభుత్వాన్ని కోరారు.
 
మృతుల కుటుంబ సభ్యులకు తన హృదయపూర్వక సంతాపం తెలిపిన గవర్నర్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు.