సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జులై 2020 (08:30 IST)

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు...

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు. ఆమె శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టు కారణంగా ఆమె ముంబై ఆస్పత్రిలో చనిపోయారు. శ్వాస సమస్యతో బాధపడుతూ వచ్చిన సరోజ్ ఖాన్‌ను ఈ నెల 20వ తేదీన ముంబైలోని గురునానక్ ఆస్పత్రిలో ఆమె అడ్మిట్ చేశారు. అక్కడ ఐసీయూ వార్డులో చికిత్స పొందుతూ వచ్చిన ఆమెకు శుక్రవారం కార్డియాక్ అరెస్ట్ కావడంతో కన్నమూశారు. 
 
కాగా, ఆమె అంత్యక్రియలు ముంబై మలాడ్ లోని మాల్వానిలో జరుగనున్నాయి. నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్న సరోజ్ ఖాన్... దాదాపు 40 యేళ్ళకు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఈమె సుమారు 2 వేల పాటలకు పైగా కొరియోగ్రాఫర్ చేశారు.