చెర్రీ భార్య ఇంట విషాదం.. తితిదే తొలి ఈవో ఇకలేరు...
మెగా కోడలు, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమెను ఎంతో అల్లాముద్దుగా చూసుకునే తాతయ్య కె. ఉమాపతి రావు ఇకలేరని ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
ఈ పోస్టులో ఆమె తన తాతయ్య గొప్పదనాన్ని వివరించారు. "ఆయన గొప్ప విలువలు, నిస్వార్థం, మానవత్వం ఉన్న వ్యక్తి అని తెలిపింది. తన తాతయ్యకు హాస్య చతురత కూడా ఎక్కువేనని ఆమె చెప్పింది. ఉర్దూ భాషలో ఆయన పలు రచనలు చేశారని తెలిపింది.
ఎన్నో మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంది. 1928, జూన్ 15న పుట్టిన ఆయన 2020 మే 27న కన్నుమూశారని తెలిపింది. కాగా, ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు తొలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేశారు.