సంబంధిత వార్తలు
- నవీన్ పోలిశెట్టి వెర్సెస్ కె.ఎ.పాల్ - వైజాగ్ లో అభిమానుల సందడి
- ప్రేమతో కౌగిలించుకోవడం కూడా అనుష్క దగ్గరే నేర్చుకున్నా... నవీన్ పోలిశెట్టి
- జాతి రత్నాలు హిట్ తర్వాత ఒత్తిడికి గురయ్యాను : నవీన్ పొలిశెట్టి
- నవీన్ పొలిశెట్టి, అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ సిద్ధమైంది
- ఆ చిత్రంలో నా జీవితం మారిపోయింది : నవీన్ పోలిశెట్టి
యూ/ఏ సర్టిఫికేషన్ తో రాబోతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
Naveen Polishetty, Anushka
రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో దర్శకుడు మహేష్ బాబు.పి తెరకెక్కించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఇదే రెస్పాన్స్ రేపు థియేటర్ లోనూ దక్కుతుందని నమ్మకంతో మూవీ టీమ్ ఉన్నారు. మరోవైపు సినిమాను ఆడియెన్స్ కు మరింత దగ్గర చేసేందుకు ప్రమోషన్ టూర్స్ చేస్తున్నారు హీరో నవీన్ పోలిశెట్టి. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరులో ఆయన పర్యటిస్తున్నారు. ఈ టూర్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.
నటీనటులు: నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి తదితరులు
