ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (11:24 IST)

ప్రేమతో కౌగిలించుకోవడం కూడా అనుష్క దగ్గరే నేర్చుకున్నా... నవీన్ పోలిశెట్టి

Naveen Polishetty, Anushka
అనుష్క శెట్టి, యువ నటుడు నవీన్ పోలిశెట్టి రొమాంటిక్ డ్రామా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో కలిసి నటించారు. త్వరలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో నిర్మాతలు ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించారు. నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నారు. 
 
ఈ సందర్భంగా అనుష్క శెట్టిని కౌగిలించుకోవడంపై నవీన్ పొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది. ఇంటర్వ్యూలు, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. షూటింగ్ మొదలైనప్పుడు స్టార్ హీరోయిన్ అనుష్క పక్కన నటించడం అంత ఈజీ కాదు. షూటింగ్ మొదలైన మొదటి రెండు రోజులు కాస్త ఇబ్బంది పడ్డాను. అనుష్క ప్రోత్సాహంతో ఆమెతో సహజంగా నటించాను. ఈ సినిమాతో అనుష్క శెట్టి మంచి స్నేహితురాలైంది. 
 
సినిమాలో మా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. సెట్స్‌లో అనుష్క అందరితో స్నేహంగా ఉంటుంది. సెట్స్‌లోకి అడుగుపెట్టగానే ముందుగా సాంకేతిక నిపుణులను, తోటి నటీనటులను ఆప్యాయంగా కౌగిలించుకుంటుంది. ప్రేమతో కౌగిలించుకోవడం కూడా అనుష్క శెట్టి దగ్గరే నేర్చుకున్నాను.

ఇది ఆమె మంచి లక్షణాలలో ఒకటి. ఈ చిత్రంలో మురళీ శర్మ, జయసుధ, తులసి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ రొమాంటిక్, కామెడీ డ్రామా సెప్టెంబర్ 7, 2023న విడుదల అవుతుంది.