నాలుగు భాషల్లో 4న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్
polisety elease poster
యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో భాగమతి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అనుష్క నటిస్తోన్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి . సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగినట్లు ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు సాంగ్స్ రిలీజ్ కాగా.. వాటికి ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అందులో ఓ పాటను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పాడటం విశేషం. ఈ క్రమంలో తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క.. స్టాండప్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్ పొలిశెట్టి పాత్రలు మనసులను హత్తుకునేలా రూపొందించారు. టీజర్ చూడగానే ఆ విషయం క్లియర్‌గా తెలిసిపోతుంది. తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను గమనిస్తే.. అందులోనూ హీరో హీరోయిన్లు ఉన్నారు. ఓ ప్లెజంట్ ఫీలింగ్ ఇచ్చేలా పోస్టర్ ఉంది. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మెప్పంచటానికి ఆగస్ట్ 4న మన ముందుకు వచ్చేస్తుంది.
