సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (15:52 IST)

బయట వ్యక్తితో ప్రేమలో పడ్డ అనుష్క శెట్టి !

Anuksha with krishnamraju
Anuksha with krishnamraju
సినీ నటీమణులు ప్రేమలో పడడం సహజమే. టీనేజ్‌లో వున్నప్పుడు రకరకాలుగా ఆకర్షణగా లోనయి ప్రేమలో పడుతున్నట్లు చాలామంది చెబుతుంటారు. అందులో అనుష్క మినహాయింపు ఏమీ కాదు. తాను కూడా టీనేజ్‌లో వుండగా ప్రేమలో పడ్డానని తెలిపింది. అరుంధతి, పంచాక్షరని, భాగమతి సినిమాలు చేసింది. తాజాగా ఆమె మేకప్‌ మేన్‌ నిర్మాతగా ఓ సినిమా తెలుగులో చేసింది. అది షూటింగ్ దశలో ఉంది. త్వరలో విడుదల కాబోతుంది.
 
కాగా, ఓసారి మీడియాతోపాటు మాట్లాడుతూ, తనకూ క్రికెట్‌ అంటే  పిచ్చి. ఆ టైంలో టీనేజ్‌లో వున్నా.  రాహుల్‌ ద్రావిడ్‌ అంటే పిచ్చి ప్రేమ. అలాంటిది అనుకోకుండా సినిమాల్లోకి రావడంతో ఇదో లోకం అయింది. అయితే ఇప్పుడు ఎవరితోనూ ప్రేమలో పడలేదనీ, ప్రస్తుతం నా కెరీర్‌ చూసుకోవడంలోనే టైం సరిపోతుందని అంటోంది. గతంలో ఆమె చెప్పిన ఈ మాటలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇక ప్రభాస్‌కూ, అనుష్కకు మధ్య స్నేహంమాత్రమే, ప్రేమ లేదని ఇద్దరూ నొన్కి వక్కాణించారు. ఇద్దరికీ ఇష్టం అయితే నాకేం ఇబ్బంది లేదని అప్పట్లో కృష్ణం రాజు గారు అన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆయనతో ఉన్న ఫోటోను కూడా సోషల్ మీడియాలో దాచుకుంది. మరి ముందు ముందు పెళ్లి ఇంకెన్ని విషయాలు చెబుతుందో చూడాలిమరి.