దర్శకుడు హరీష్ శంకర్ లేటెస్ట్‌గా పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. అందులో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నట్లు ఆమె ఎంటర్ అయిన కారణంగా శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇందులో ఆమె పాత్ర ఎలా వుంటుంది అనేది పెద్దగా తెలీయకపోయినా పవన్ అభిమానులు మాత్రం ఖుషీ అయ్యారు. శ్రీలీల నటించిన థమాకాలో డాన్స్‌తో అలరించింది. అందుకే ఆమెతో ఓ ఐటెం నెంబర్ చేయించమని ట్విట్టర్‌లో హరీష్‌కు అభిమానులు విన్నవించారు.
అందుకు ఆయన పాజటివ్‌గా తీసుకుని థంప్ చూపిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో శ్రీలీల, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లోమంచి డాన్స్‌నెంబర్ వస్తుందని ఆనందపడ్డారు. పవన్, శ్రుతిహాసన్‌ల మధ్య వచ్చి డాన్స్ నెంబర్ మంచి పేరు తెచ్చుకుంది. ఈసారి శ్రీలీలతో మంచి సాంగ్ చేయమని మరికొందరు సూచించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.