శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2023 (16:19 IST)

నవీన్ పోలిశెట్టి వెర్సెస్ కె.ఎ.పాల్ - వైజాగ్ లో అభిమానుల సందడి

ka PAL- NAVEEN
ka PAL- NAVEEN
వైజాగ్ లో చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. నిన్న  రాత్రి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్, యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి సందడి చేశారు. నిన్న రాత్రి వైజాగ్  బీచ్ రోడ్డులోని సిగ్నల్ వద్ద కె.ఏ.పాల్ తన వాహనాన్ని ఆపి యువతతో ముచ్చటిస్తున్నారు. సీఎం అంటూ అక్కడున్న వారంతా నినాదాలు చేస్తుండగా  కె.ఏ.పాల్  శైలి లో అందరికి  అభివాదం చేశారు. ఇన్తలో ఆయన పక్కన మరో కారు ఆగింది. 
 
 తన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ప్రచారం కోసం వైజాగ్ వచ్చిన నవీన్ సిగ్నల్ వద్ద ఆగాడు. కారులో నుంచి బయటికి వచ్చిన నవీన్ ను చూసిన యువకులంతా కె.ఏ.పాల్ దగ్గరి నుంచి నవీన్ వైపు పరుగులు తీశారు. సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కె.ఏ.పాల్ ను చూసిన ననీన్.... తనదైన శైలిలో సమస్కరిస్తూ ముందుకెళ్లడంతో పాల్ ఆశ్చర్యపోయాడు. అభిమానులు తీసిన వీరిద్దరి వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారింది.