విశేషాధారణ దక్కించుకుంటున్న ముగ్గురు మొనగాళ్ళు
Mugguru monagaallu
ఈ చిత్రంలో ఎన్నో థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయి. 'గరుడ వేగ' ఫేమ్ అంజి అందించిన విజువల్స్, సురేష్ బొబ్బిలి సంగీతం, చిన్న నేపేథ్య సంగీతం వంటివి ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలుగా నిలిచాయని చెప్పొచ్చు. ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్‌లో మంచి ఆదరణ దక్కుతుంది.అలాగే మంచి వ్యూయర్ షిప్ కూడా నమోదవుతుండడం హర్షించదగ్గ విషయం. ఆల్రెడీ 'ముగ్గురు మొనగాళ్ళు' అమెజాన్ ప్రైమ్‌లో నెంబర్ 2 ప్లేస్ లో ట్రెండ్ అవుతుండడం విశేషం. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'చిత్రమందిర్ స్టూడియోస్' బ్యానర్ పై అచ్యుత్ రామారావు నిర్మించారు.
నటీనటులు : శ్రీనివాసరెడ్డి, దీక్షిత్ శెట్టి (దియా మూవీ హీరో), వెన్నెల రామారావు, రిత్విష్‌శర్మ, శ్వేతా వర్మ, నిజర్, రాజా రవీంద్ర, జెమిని సురేష్, జోష్ రవి, భద్రం, సూర్య, జబర్తస్త్ సన్నీ

