1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Nandamuri Balakrishna comments on arrogance and future plans

నాకు పొగరు నిజమే.. దానికి కారణం కూడా నేనే : బాలకృష్ణ

nandamuri Balakrishna
చాలా మంది నాకు పొగరని అంటుంటారని, అది నిజమే.. దానికి కారణం కూడా నేనే.. నన్ను చూసుకునే నాకు పొగరు, ఇకపై బాలకృష్ణ అంటే ఏంటో చూపిస్తాను అని సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. తితిదే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 64వ పుట్టినరోజు వేడుకలను మంగళవారం జరుపుకున్ినారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 
 
తల్లిదండ్రుల ఆశీస్సులు, అభిమానుల అండదండలతో 64 యేళ్ళు విజయవతంగా పూర్తి చేసుకున్నాను. వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే. దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. చాలా మంది నాకు పొగరని, అహంకారమని అంటుంటారు. అవును.. నన్ను చూసుకుంటే, నా క్రమశిక్షణ, నా అంకితభావం చూసుకుంటే నాకే పొగరుగా అనిపిస్తుంది. అందులో తప్పేముంది అని తనదైనశైలిలో వ్యాఖ్యానించారు. బిరుదులు వస్తుంటాయి.. పోతుంటాయని, వాటికి తాను అలంకారమే తప్ప అవి తనకు అలంకారం కాదన్నారు. మనం పని మనం నిజాయితీగా చేసుకుంటూ పోవడమే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. 
తర్వాతి కథనం
NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా