1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Naresh strong warning to hero Srikanth

హీరో శ్రీకాంత్‌కు నరేష్ స్ట్రాంగ్ వార్నింగ్..?

Naresh
మా ఎన్నికలు కాస్త నటుల మధ్య గొడవకు కారణమవుతున్న విషయం తెలిసిందే. మా ఎన్నికల వేడి ప్రారంభమైనప్పటి నుంచి ఈ గొడవ ప్రారంభమైంది. అయితే అది కాస్త చివరకు సాయిధరమ్ తేజ్ రోడ్డుప్రమాదానికి సంబంధించిన విషయంలోను గొడవకు కారణమైంది.
 
మా ఎన్నికలకు, సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి సంబంధమేంటి అనుకుంటున్నారా..ఉంది. అది కూడా సీనియర్ నటుల మధ్య గొడవకు ప్రధాన కారణమైంది కూడా. సాయిధరమ్ తేజ్ వేగంగా మోటార్ నడపడం వల్ల ప్రమాదం జరిగిందని అందరూ అనుకుంటున్నారు. 
 
అయితే అలా జరగలేదు. రోడ్డుపై మట్టి ఉండడంతో జారి కిందపడ్డాడు సాయిధరమ్ తేజ్. అందుకే మన పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదు. అస్సలు మనం మోటార్ బైకులను నడపకూడదని నిర్ణయించుకోవాలి అంటూ సినీ నటుడు నరేష్ వ్యాఖ్యలు చేశారు.
 
అది కాస్త పెద్ద చర్చకు దారితీసింది. బైకులను పూర్తిగా మానెయ్యాలని..సినీనటుల కుమారుడు, కుమార్తెలు వాహనాలను నడపకూడదని నరేష్ చెప్పడం ఏంటంటూ శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. అది కాస్త పెద్ద దుమారాన్నే రేపింది.
 
చివరకు ఆ వీడియోపై కాసేపటి క్రితమే స్పందించారు నరేష్. నువ్వు సినిమాలో హీరోగా వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు. నేను తెలుగు సినీ పరిశ్రమలో 50 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను. నేను ఎలాంటి సినిమాలు చేశానో నాకు తెలుసు.
 
నేను ఎక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చినా కాంట్రవర్సిలు, పొలిటికల్ మాట్లాడడం నాకు తెలియదు. ఇప్పటి వరకు అలాంటి సంధర్భాలు జరగలేదు. నువ్వు కూడా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు అంటూ శ్రీకాంత్‌కు వార్నింగ్ ఇచ్చాడు నరేష్. అంతేకాదు ఇంకోసారి తనపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 
About Writer
జె
తర్వాతి కథనం
టాలీవుడ్ డ్రగ్స్ కేసు : నేడు ఈడీ ముందుకు ముమైత్ ఖాన్