గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 సెప్టెంబరు 2021 (17:04 IST)

తేజ్ కూడా నాకు బిడ్డ లాంటి వాడే.. నా ఇంటి నుంచే కదిలాడు.. నరేష్

హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదపై తాజాగా సీనియర్ నటుడు నరేష్ ఈ ప్రమాదంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బైక్ రైడింగ్ విషయంలో చాలా సార్లు నా కొడుకుని, సాయి ధరమ్ తేజ్‌‌ని హెచ్చరించానని ఆయన అన్నారు. 
 
తేజ్ కూడా నాకు బిడ్డ లాంటి వాడేనని పేర్కొన్న ఆయన నిన్న సాయంత్రం నా ఇంటి నుంచే సాయి ధరమ్ తేజ్ బయలుదేరాడని, గతంలో కూడా బైక్స్ ఫై తేజ్, నా కొడుకు ఇద్దరూ రైడ్స్‌కి వెళ్లేవాళ్లని పేర్కొన్న ఆయన నాలుగు రోజుల క్రితమే ఇద్దరికి కౌన్సిలింగ్ కూడా ఇద్దాం అనుకున్నానని అన్నారు. 
 
తాను బైక్ ప్రమాదానికి గురైనప్పుడు తన అమ్మ బైక్ మీద వెళ్లనని ఒట్టు వేయించుకుందని బైకులు ముట్టుకోకుండా ఉండడం మంచిదని ఆయన అన్నారు. ఇక తేజ్ త్వరగానే కోలుకుంటాడని ఆశాభావం వ్యకం చేసిన ఆయన పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే తిరిగి సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. 
 
సాయి ధరమ్ తేజ్ ప్రమాదం కేసులో పోలీసులు కూపీ లాగుతున్నారని అంటున్నారు. ఇక ఇప్పటికే 336 ఐపీసీ , 184 ఎంవీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రేసింగ్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.