నిధి అగర్వాల్‌కు ఐటమ్ ఆఫర్.. భారీగా డిమాండ్ చేసిందట..

nidhi agarwal
nidhi agarwal
సెల్వి| Last Updated: శనివారం, 21 మార్చి 2020 (17:09 IST)
సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్‌ ప్రస్తుతం ఐటమ్ గర్ల్‌గా మారనుంది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలు ఫ్లాఫ్ కావడంతో.. కాస్త బాధపడిన ఈ అమ్మడు.. మూడో చిత్రం ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్ కొట్టేసరికి అమ్మడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

ప్రస్తుతం చేతిలో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామకు ఐటెం ఆఫర్ వచ్చిందట. ఇటీవల ఓ నిర్మాత ఐటెం సాంగ్ విషయంలో నిధిని సంప్రదించగా, ఆమె 60 లక్షలు డిమాండ్ చేసినట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాలసీని ఈ అమ్మడు బాగా పాటిస్తుందని నెటిజన్స్ అంటున్నారు. సదరు నిర్మాత సైతం ఆమె అడిగిన దానికి ఓకే అన్నట్లు సమాచారం.దీనిపై మరింత చదవండి :