సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (12:39 IST)

అనుష్కకు ప్రేమ విఫలం... ప్రభాస్‌తో మాత్రం కాదట!

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్‌గా పేరుగడించిన హీరోయిన్లల అనుష్క శెట్టి ఒకరు. అక్కినేని నాగార్జున నటించిన "సూపర్" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఆమె అనేక చిత్రాల్లో నటించి, అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. పైగా, అనేక కీలకమైన పాత్రల్లో ఆమె నటించింది. అలాంటి అనుష్క ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ హీరోయిన్. 
 
గతంలో ఈమె ప్రేమలో పడిందనే వార్తలు షికారు చేశాయి. కానీ, ఆమె ఎపుడు కూడా స్పందించారు. కానీ ఇపుడు ఆమె తన ప్రేమ వ్యవహారంపై స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనుష్క పలు విషయాలు తెలిపింది. తనకంటూ సొంత జీవితం ఉంటుందని, ఇందులో కొందరు కల్పించుకుంటుండటం తనకు నచ్చడం లేదని చెప్పింది.
 
తన ప్రేమ, పెళ్లి గురించి కొందరు ఎన్నో ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నారని అనుష్క తెలిపింది. 2008లో తానూ ప్రేమలో పడినట్లు, అదో తీయని ప్రేమ అని చెప్పింది. అయితే, కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయామని తెలిపింది. తాను ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరన్న విషయాన్ని తాను చెప్పబోనని పేర్కొంది. 
 
అదేసమయంలో తాను, ప్రభాస్‌ మాత్రం మంచి స్నేహితులమని, తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని అనుష్క శెట్టి స్పష్టం చేసింది. కాగా, ఆమె నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ వచ్చేనెల 2న విడుదలకావాల్సివుంది. అయితే, కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం విడుదల అనుమానాస్పదంగా మారింది.