ప్రిన్స్ మహేష్ మేనల్లుడు మూవీ ప్రారంభం.. క్లాప్ కొట్టిన చెర్రీ
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ డెబ్యూ మూవీ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి హీరోలు రామ్ చరణ్, రానా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వీరితో పాటు మంజుల, సుధీర్ బాబు, గల్లా జయదేవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, హీరో హీరోయిన్స్ మధ్య రామ్ చరణ్ క్లాప్ కొట్టారు. చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అతి త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని 'దేవదాస్' ఫేం శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందించనున్నారు. పద్మావతి గల్లా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' హీరోయిన్ నిధి అగర్వాల్.. అశోక్ సరసన నటిస్తుంది.