శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 9 నవంబరు 2019 (20:47 IST)

బోయ‌పాటి రెమ్యూన‌రేష్‌లో కోత ప‌డిందా..?

ఊర మాస్ డైరెక్ట‌ర్ అన‌గానే అంద‌రికీ ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు బోయ‌పాటి శ్రీను. ఎన్నో స‌క్స‌స్ ఫుల్ మూవీస్ అందించిన బోయ‌పాటి 15 కోట్లు రెమ్యూన‌రేషన్ తీసుకునేవారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో తెర‌కెక్కించిన విన‌య విధేయ రామ సినిమాకి బోయ‌పాటి 15 కోట్లు రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నారు. అయితే.. ఈ సినిమా డిజాష్ట‌ర్ అవ్వ‌డంతో బోయ‌పాటి రెమ్యూన‌రేష‌న్ స‌గానికి ప‌డిపోయింది.
 
తాజాగా బోయ‌పాటి బాల‌య్య‌తో ఓ భారీ సినిమాని తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. జ‌న‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమాకి బోయ‌పాటి రెమ్యూన‌రేష‌న్ 8 కోట్లు అని తెలిసింది. సినిమా బ‌డ్జెట్ విష‌యంలో ఆలోచ‌న‌లో ప‌డిన నిర్మాత‌కు అవ‌స‌ర‌మైతే త‌న రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించండి కానీ.. నిర్మాణ‌ప‌రంగా రాజీప‌డ‌ద్దు అని చెప్పార‌ట బోయ‌పాటి.
 
 
 
ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే హాట్ టాపిక్. ఇందులో న‌టించే న‌టీన‌టులు ఖ‌రారు చేసి.. త్వ‌ర‌లో అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి... ఎంతో ప‌ట్టుద‌ల‌తో సినిమా చేస్తోన్న బోయ‌పాటి బాల‌య్య‌తో హ్యాట్రిక్ అందిస్తాడేమో చూడాలి.