శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (12:47 IST)

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో... విలన్‌గా తమిళ హీరో

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కానున్నాడు. ఆయన పేరు వైష్ణవ్ తేజ్. ఈయన యువ హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు. ఇపుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయం చేస్తూ ఒక సినిమా తెరకెక్కనుంది. 
 
ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో మత్స్యుకార కుటుంబానికి చెందిన యువకుడిగా వైష్ణవ్ తేజా కనిపించనున్నాడు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటించనున్నారనేది ఆసక్తికర విషయంలో తాజాగా విజయ్ సేతుపతి పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆయనను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 
 
అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. విభిన్నంగా డిజైన్ చేసిన విలన్ పాత్రకి విజయ్ సేతుపతి సరిగ్గా సరిపోతాడనీ, ఇప్పటికే తమిళంలో బిజీగా ఉన్న ఆయన ఈ సినిమాతో... ఈ తరహా పాత్రలతో తెలుగులోనూ బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.