గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 16 మార్చి 2019 (17:23 IST)

కాంచన-3తో నాని పోటాపోటీ.. విలన్‌గానూ అదరగొట్టేస్తాడట..

''కాంచన-3'' ఏప్రిల్ 19వ తేదీన విడుదల కానుంది. లారెన్స్ కథానాయకుడిగా, దర్శకుడిగా తెరకెక్కిన కాంచన సిరీస్ హిట్టయిన నేపథ్యంలో.. ఈ సినిమాపై ప్రేక్షకులు ఆశలు పెట్టుకున్నారు. లారెన్స్ సరసన ఓవియా, వేదిక నాయికలుగా నటించిన ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
మరోవైపు నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ''జెర్సీ'' సినిమా నిర్మితమైంది. నాని క్రికెటర్‌గా కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది. రంజీ క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.
 
జెర్సీ సినిమా తర్వాత నాని, విక్రమ్ కుమార్‌తో కలిసి "గ్యాంగ్ లీడర్'' చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రాజెక్టును కూడా నాని లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాకి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాలో నాని పూర్తిస్థాయి విలన్‌గా కనిపించనున్నాడు.   
 
ఇక సుధీర్ బాబు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. నాని జోడీగా అదితీరావును తీసుకున్నారు. సుధీర్ బాబు సరసన నివేదా థామస్‌ను అనుకున్నారు గానీ, పారితోషికం విషయంలో తేడా రావడంతో, మరో కథానాయికను ఎంపిక చేసుకునే పనిలో వున్నారు.